CMF Phone 2 Pro: రూ.20 వేల లోపు టెలిఫోటో లెన్స్‌తో వస్తున్న ఫోన్.. "CMF ఫోన్ 2 ప్రో" 10 month ago
నథింగ్ కంపెనీ తాజాగా "CMF Phone 2 Pro" పేరుతో తమ కొత్త బడ్జెట్ మొబైల్‌ను విడుదల చేసింది. ఇది.. దీని ప్రీవియస్ మొబైల్ "CMF ఫోన్ 1" మొబైల్‌కు అప్డేటెడ్ వర్షన్ గా రిలీజ్ చేసారు. ఈ మొబైల్ తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఇది పెద్ద స్క్రీన్, ప్రత్యేకమైన డిజైన్, మెరుగైన కెమెరాలు.. అద్భుతమైన ప్రాసెసర్‌తో వస్తోంది. ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ వంటి ప్రత్యేకతలు ఈ మొబైల్‌కు అదనపు ఆకర్షణను ఇస్తున్నాయి. ఒకసారి ఈ ఫోన్ ఫీచర్ల వైపు ఒక లుక్ వేద్దాం రండి.!
CMF Phone 2 Pro ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.77 అంగుళాలు FHD+ AMOLED
రిఫ్రెష్ రేట్: 120 Hz
ప్రాసెసర్: MediaTek Dimensity 7300 Pro
పీక్ బ్రైట్‌నెస్: 3000 nits
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, Nothing OS 3.2
బరువు: 185 గ్రాములు
బ్యాటరీ: 5000 mAh
ఛార్జింగ్: 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా
- 50 MP టెలిఫోటో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 MP
వేరియంట్స్:
8GB RAM + 128GB స్టోరేజ్
8GB RAM + 256GB స్టోరేజ్
కలర్ ఆప్షన్స్:
- బ్లాక్
- ఆరెంజ్
- లైట్ గ్రీన్
- వైట్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G డ్యూయల్ సిమ్
- Wi-Fi 6
- బ్లూటూత్ 5.3
- USB టైప్-C
- NFC
సెన్సార్లు: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (ఆప్టికల్) లైట్ సెన్సార్ ప్రాక్సిమిటీ సెన్సార్ యాక్సిలెరోమీటర్ కంపాస్ గైరోస్కోప్
ధరలు:
8GB RAM, 128GB స్టోరేజ్ -- ₹18,999
8GB RAM, 256GB స్టోరేజ్ -- ₹20,999
ప్లస్ పాయింట్స్:
- టెలిఫోటో లెన్స్ (2x ఆప్టికల్ జూమ్)
- క్లీన్ సాఫ్ట్‌వేర్ (Nothing OS)
- లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్
మైనస్ పాయింట్స్:
- పూర్తి వాటర్ రెసిస్టెన్స్ కాదు
- సింగిల్ బాటమ్-ఫైరింగ్ స్పీకర్
- స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం
చివరిగా చెప్పాలంటే.. "CMF ఫోన్ 2 ప్రో" మొబైల్ మంచి ఫీచర్లను అందిస్తుంది. ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి పోటీదారుగా నిలుస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, టెలిఫోటో లెన్స్‌తో కూడిన మెరుగైన కెమెరా సెట్-అప్.. అలాగే క్లీన్ నథింగ్ OS అనుభవం దీని ప్రత్యేకతలు. ఇది ఎక్కువ కాలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను కూడా ఇస్తుంది.. ఆ ధరలు..ఇలా రావడం చాలా అరుదు. అయితే ఫుల్ వాటర్ రెసిస్టెన్స్ లేకపోవడం మరియు సింగిల్ స్పీకర్ వంటి కొన్ని లోపాలున్నప్పటికీ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారికి CMF ఫోన్ 2 ప్రో ఒక ఆసక్తికరమైన ఎంపిక. ఇది మే 5 నుండి.. ఫ్లిప్‌కార్ట్, క్రోమా మరియు రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
ఇది చదవండి: బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్.. స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో "ఒప్పో A5 ప్రో"..